Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చదువుతోపాటు హస్తకళల్లోనూ నైపుణ్యం పెంపొందించుకోవాలి

Author
Posted By A Bharat Goud
| 18 Nov 2026, 07:36 PM |
చదువుతోపాటు హస్తకళల్లోనూ నైపుణ్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి చూపాలి: జిల్లా గ్రంథాలయ అధికారిణి ఆర్. పరమేశ్వరి

నాగర్‌కర్నూల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు విద్యతోపాటు తమలోని సృజనాత్మకతను వెలికితీసి హస్తకళల్లో నైపుణ్యం సాధించాలని జిల్లా గ్రంథాలయ అధికారిణి ఆర్. పరమేశ్వరి సూచించారు. స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి పెంపొందించుకొని భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ ప్రకృతిలో లభించే మట్టి, రాళ్లు, చెట్లు వంటి సహజ వనరులతో ఎన్నో కళారూపాలను రూపొందించవచ్చన్నారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య నేపథ్యంలో స్వయం ఉపాధి రంగాలకు ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు.

యువత తమలోని సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి ద్వారా ఎదగాలని సూచించారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కల్పన, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సిబ్బంది కర్నె వెంకటేష్, తాజుద్దీన్, కమర్, శ్రీకాంత్‌తోపాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి