చదువుతోపాటు హస్తకళల్లోనూ నైపుణ్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి చూపాలి: జిల్లా గ్రంథాలయ అధికారిణి ఆర్. పరమేశ్వరి నాగర్‌కర్నూల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు విద్యతోపాటు తమలోని సృజనాత్మకతను వెలికితీసి హస్తకళల్లో నైపుణ్యం సాధించాలని జిల్లా గ్రంథాలయ అధికారిణి ఆర్. పరమేశ్వరి సూచించారు. స్వయం ఉపాధి రంగాలపై ఆసక్తి పెంపొందించుకొని భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ ప్రకృతిలో లభించే మట్టి, రాళ్లు, చెట్లు వంటి సహజ వనరులతో ఎన్నో కళారూపాలను రూపొందించవచ్చన్నారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య నేపథ్యంలో స్వయం ఉపాధి...