Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 08:41 PM | Crime
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు వ్యక్తులు అదుపులోకి.. బెంగళూరుకు తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి

కోదాడ, అక్టోబర్ 31, ప్రజానేస్తం జ్వాల: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. దుర్గాపురం స్టేజి వద్ద శనివారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి కేఏ 03 ఎంజే 4712 నంబర్ గల కారులో గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కోదాడ పట్టణ పోలీసులు దుర్గాపురం స్టేజి వద్ద కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి సరఫరా చేసేందుకు తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.