Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భీమదేవరపల్లి మండలానికి 837 కొత్త పింఛన్లు.. పేదలకు ఆర్థిక భరోసా

Author
Posted By Nagilla Rajinikanth
| 18 Nov 2026, 06:09 PM |
భీమదేవరపల్లి మండలానికి 837 కొత్త పింఛన్లు.. పేదలకు ఆర్థిక భరోసా

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు – మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా ప్రభుత్వ చేయూత పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమదేవరపల్లి మండలానికి కొత్తగా 837 చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు పొందలేకపోయిన వారికి సైతం ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.

భీమదేవరపల్లి మండలానికి 837 కొత్త పింఛన్లు.. పేదలకు ఆర్థిక భరోసా - Additional Image

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు మహిళా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించి వారికి అవసరమైన ఉచిత సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు విద్యాసంస్థల అభివృద్ధి, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయం
సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరినప్పుడే వాటి అసలైన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, మండల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా అధికారులు, పింఛన్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.