భీమదేవరపల్లి మండలానికి 837 కొత్త పింఛన్లు.. పేదలకు ఆర్థిక భరోసా

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు – మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా ప్రభుత్వ చేయూత పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు....