Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 06:03 PM |
కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ

జీపీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్.కె. యాకూబ్ పిలుపు

గరిడేపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు, పెన్షన్ సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న కార్మికుల పోరాటాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్.కె. యాకూబ్ పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. బుధవారం గరిడేపల్లిలోని ఎంఎస్ భవన్‌లో కొండ సైదులు అధ్యక్షతన గ్రామపంచాయతీ (జీపీ) కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.కె. యాకూబ్ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు, కనీస పెన్షన్ రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. దశాబ్దాల పాటు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కులు, స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. కొత్త లేబర్ కోడ్ల అమలుతో కార్మికులపై పని భారం పెరిగే ప్రమాదం ఉందని, వారి హక్కులు మరింత బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

కార్మికుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో మహిళా కార్మికులు 50 శాతం మంది పాల్గొననున్నారని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కొండ సైదులు, గోపగాని సత్యం, రావుల వెంకన్న, సుధీర్ రెడ్డి, నర్సిరెడ్డి, మచ్చ వీరస్వామి, మహేష్, సిద్ధయ్య, సీతమ్మ, అమరవరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.