కార్మికుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ

జీపీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్.కె. యాకూబ్ పిలుపు గరిడేపల్లి, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల పెంపు, పెన్షన్ సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న కార్మికుల పోరాటాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్.కె. యాకూబ్ పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. బుధవారం గరిడేపల్లిలోని ఎంఎస్ భవన్‌లో కొండ సైదులు అధ్యక్షతన గ్రామపంచాయతీ (జీపీ) కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.కె....