Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్ కన్నుమూత

Author
Posted By Amruth Varma Bolugoddu
| 18 Nov 2026, 05:57 PM |
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్ కన్నుమూత

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస

వరంగల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ వ్యాపారవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అచ్చ విద్యాసాగర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయ వర్గాలు, పెరిక సామాజిక వర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో అచ్చ విద్యాసాగర్ చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ లక్ష్యాల సాధన కోసం తనవంతు కృషి చేస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. వ్యాపార రంగంలోనూ ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి

వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, సంఘ అభివృద్ధికి, సామాజిక ఐక్యతకు విశేషంగా కృషి చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యులకు అందుబాటులో ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి, రాజకీయ రంగానికి, వ్యాపార రంగానికి, పెరిక సామాజిక వర్గ అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అచ్చ విద్యాసాగర్ మరణం తెలంగాణ ఉద్యమకారులకు, రాజకీయ నాయకులకు, పెరిక సామాజిక వర్గానికి తీరని లోటుగా మిగిలింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.