మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్ కన్నుమూత

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస వరంగల్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ వ్యాపారవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అచ్చ విద్యాసాగర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయ వర్గాలు, పెరిక సామాజిక వర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో అచ్చ విద్యాసాగర్ చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ లక్ష్యాల సాధన కోసం తనవంతు కృషి చేస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు....