Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పోలీస్ అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం.. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 05:55 PM |
పోలీస్ అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం.. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

కొమురం భీం ఆసిఫాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, అంకితభావం, ధైర్యసాహసాలను సమాజం ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు. వారి త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వ్యాసరచన పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా ధోరణిని, రచనా నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని తమలోని ప్రతిభను వెలికితీయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.