పోలీస్ అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం.. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు
కొమురం భీం ఆసిఫాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, అంకితభావం, ధైర్యసాహసాలను సమాజం ఎప్పటికీ మరువకూడదని పేర్కొన్నారు. వారి త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే...