Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దివ్యాంగ చిన్నారులకు మండల స్థాయి క్రీడా పోటీలు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 03:25 PM |
దివ్యాంగ చిన్నారులకు మండల స్థాయి క్రీడా పోటీలు

హుజూర్‌నగర్, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా హుజూర్‌నగర్ భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో భవిత కేంద్రంతో పాటు మండలంలోని దివ్యాంగ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యారమ్స్‌, ఖోఖో, డ్రాయింగ్‌, రన్నింగ్‌, కబడ్డీ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు మండల విద్యాధికారి సైదా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు చిన్నారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎడ్యుకేటర్లు వనజ, శ్రీనివాస్, ఉపేందర్, ఐఈఆర్పీలు శ్రీనివాస్, గోవింద్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.