దివ్యాంగ చిన్నారులకు మండల స్థాయి క్రీడా పోటీలు
హుజూర్‌నగర్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా హుజూర్‌నగర్ భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో భవిత కేంద్రంతో పాటు మండలంలోని దివ్యాంగ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యారమ్స్, ఖోఖో, డ్రాయింగ్, రన్నింగ్, కబడ్డీ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు మండల విద్యాధికారి సైదా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు చిన్నారుల్లోని...