Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్రంలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు!

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 12:17 PM |
రాష్ట్రంలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు!

హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ (కోఆపరేటివ్-II) ఈ నెల 11న మెమో నంబర్ 8983/COOP.II/1/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 15-A, సెక్షన్ 43, సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కొత్త సంఘాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న సంఘాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి చట్టబద్ధమైన నిబంధనలు, నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత ప్రక్రియలను పూర్తిచేసిన అనంతరం సమర్థ అధికారుల నుంచి తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో సహకార వ్యవస్థ విస్తరణకు ఈ నిర్ణయం కీలక ముందడుగుగా నిలవనుంది.