రాష్ట్రంలో కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు!

హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ (కోఆపరేటివ్-II) ఈ నెల 11న మెమో నంబర్ 8983/COOP.II/1/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 15-A, సెక్షన్ 43, సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం...