Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చింతలపాలెం మండల అఖిల భారత యాదవ సంఘం నూతన కమిటీ నియామకం

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:48 AM |
చింతలపాలెం మండల అఖిల భారత యాదవ సంఘం నూతన కమిటీ నియామకం

చింతలపాలెం, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): చింతలపాలెం మండలంలో అఖిల భారత యాదవ సంఘం నూతన కమిటీని నియమించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యాదవుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా మునగ చిన్న వీరయ్య, ఉపాధ్యక్షుడిగా కుంటి గొర్ల లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా బడుగుల శ్రీనివాస్, ట్రెజరర్‌గా దాసరి లింగారావును నియమించారు. ఈ మేరకు నియోజకవర్గ అధ్యక్షుడు జక్కుల మల్లయ్య యాదవ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి చింతలపాలెం మండలంలోని 16 గ్రామాల నుంచి సుమారు 100 మంది యాదవ సంఘం ప్రముఖులు, నాయకులు హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలేడి శ్రీనివాస్, మల్కాపురం గ్రామ సర్పంచ్ చింత్ర్యాల ఆంజనేయులు, చిరా శ్రీనివాస్ తదితర మండల నాయకులతో పాటు హుజూర్‌నగర్ నుంచి జక్కుల శంబయ్య, జాల గురవయ్య, జక్కుల జయరాం, పండగ కొరివేరయ్య, జక్కుల రమేష్, పాశం వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి, యాదవుల సమస్యల పరిష్కారానికి, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి