చింతలపాలెం మండల అఖిల భారత యాదవ సంఘం నూతన కమిటీ నియామకం
చింతలపాలెం, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): చింతలపాలెం మండలంలో అఖిల భారత యాదవ సంఘం నూతన కమిటీని నియమించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యాదవుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా మునగ చిన్న వీరయ్య, ఉపాధ్యక్షుడిగా కుంటి గొర్ల లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా బడుగుల శ్రీనివాస్, ట్రెజరర్‌గా దాసరి లింగారావును నియమించారు. ఈ మేరకు నియోజకవర్గ అధ్యక్షుడు జక్కుల మల్లయ్య యాదవ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి చింతలపాలెం మండలంలోని 16 గ్రామాల నుంచి సుమారు 100 మంది యాదవ సంఘం...