Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:43 AM |
అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

అర్వపల్లి, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మంగళవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, పెట్రోలింగ్ తీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని, కేసుల నమోదు విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రాథమిక విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

మండల పరిధిలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాత నేరస్థులు, నేరాలకు అలవాటు పడిన వ్యక్తులు, షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. గ్లోబల్ జియోట్యాగింగ్ విధానం ద్వారా నేరస్థులను పర్యవేక్షించాలని, వారిని మ్యాపింగ్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఈ తనిఖీలో నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ మధు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి