అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

అర్వపల్లి, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మంగళవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, పెట్రోలింగ్ తీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని, కేసుల నమోదు విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రాథమిక విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, పోలీసులు నిరంతరం ప్రజలకు...