Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండలో విషాదం.. భవనం పైనుంచి పడి కూలీ మృతి

Author
Posted By Marelli kiran
| 18 Nov 2026, 07:38 AM |
హనుమకొండలో విషాదం.. భవనం పైనుంచి పడి కూలీ మృతి

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ నక్కలగుట్టలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాంకు భవనంలో మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి రవీందర్ రెడ్డి అనే కూలీ మృతి చెందారు. ధర్మసాగర్ మండలానికి చెందిన రవీందర్ రెడ్డి స్థానికంగా ఉన్న ఓ బ్యాంకు భవనంలో మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవనం పైనుంచి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, తోటి కార్మికులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు.

మృతుడు రవీందర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు కూలీ పనులకు వెళ్లిన ఆయన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.