హనుమకొండలో విషాదం.. భవనం పైనుంచి పడి కూలీ మృతి
హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ నక్కలగుట్టలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాంకు భవనంలో మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి రవీందర్ రెడ్డి అనే కూలీ మృతి చెందారు. ధర్మసాగర్ మండలానికి చెందిన రవీందర్ రెడ్డి స్థానికంగా ఉన్న ఓ బ్యాంకు భవనంలో మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భవనం పైనుంచి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, తోటి కార్మికులు చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. మృతుడు రవీందర్ రెడ్డికి...