Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఈ నెల 20న హనుమకొండలో జాబ్ మేళా

Author
Posted By Marelli kiran
| 18 Nov 2026, 07:38 AM |
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఈ నెల 20న హనుమకొండలో జాబ్ మేళా

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పన శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రముఖ సంస్థ పవర్‌లింక్ ఇన్‌ఫ్రాటెక్‌లో ఖాళీగా ఉన్న 30 సర్వీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల వేతనంతో పాటు పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI), ప్రయాణ భత్యం (TA), కరవు భత్యం (DA) వంటి అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ఉదయం 10:30 గంటలకు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 7893394393 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.