నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఈ నెల 20న హనుమకొండలో జాబ్ మేళా

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పన శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రముఖ సంస్థ పవర్‌లింక్ ఇన్‌ఫ్రాటెక్‌లో ఖాళీగా ఉన్న 30 సర్వీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15...