Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:37 AM |
అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వరంగల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం వరంగల్‌లోని ఎల్లిసాగర్ ఏఎస్ ఫంక్షన్ హాల్‌లో పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ పరిధిలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కలిపి మొత్తం 156 మంది నూతన లబ్ధిదారులకు మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా భోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా అర్హులైన అనేక మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 37వ డివిజన్‌లో ఇంకా పింఛన్లకు అర్హులైన వారు కొంతమంది ఉన్నారని, వారిని గుర్తించి సర్వే నిర్వహించడం ద్వారా అర్హులందరికీ చేయూత పింఛన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డీఆర్డీఓ, బిల్ కలెక్టర్, స్థానిక నాయకులు సంగారబోయిన చందర్, వైద్యం లత, ప్రతాప్ తదితరులతో పాటు నూతన పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి