అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం వరంగల్లోని ఎల్లిసాగర్ ఏఎస్ ఫంక్షన్ హాల్లో పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ పరిధిలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కలిపి మొత్తం 156 మంది నూతన లబ్ధిదారులకు మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భోగి...