Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పు బిక్షపతి ఎన్నిక

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:36 AM |
రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పు బిక్షపతి ఎన్నిక

సూర్యాపేట, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పు బిక్షపతి ఎన్నిక కావడం పట్ల పలువురు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు బిక్షపతిని హైదరాబాద్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముప్పు బిక్షపతి నాయకత్వంలో రజక సంక్షేమ సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రజకుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రజక సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు చిలకరాజు శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు జీడిమెట్ల రవి, రజక సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప తదితరులు పాల్గొని నూతన రాష్ట్ర అధ్యక్షుడికి అభినందనలు తెలియజేశారు.