రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పు బిక్షపతి ఎన్నిక
సూర్యాపేట, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ముప్పు బిక్షపతి ఎన్నిక కావడం పట్ల పలువురు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు బిక్షపతిని హైదరాబాద్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముప్పు బిక్షపతి నాయకత్వంలో రజక సంక్షేమ సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రజకుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు చిలకరాజు శ్రీను, రాష్ట్ర కమిటీ...