Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:34 AM |
ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

నేరేడుచర్ల, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి, పట్టణంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, ఎస్ఐ సీహెచ్. గోపాల్ రెడ్డి, తహసీల్దార్ సురిగి సైదులు, హైవే ఏఈ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడం, రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై పలువురు తమ సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సౌకర్యం, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని సమావేశంలో కోరారు. ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ట్రాఫిక్ నియంత్రణ అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉందని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి