ట్రాఫిక్ నియంత్రణకు అఖిలపక్ష సమావేశం

నేరేడుచర్ల, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి, పట్టణంలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, ఎస్ఐ సీహెచ్. గోపాల్ రెడ్డి, తహసీల్దార్ సురిగి సైదులు, హైవే ఏఈ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో...