Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెద్దపెండ్యాలలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 07:32 AM |
పెద్దపెండ్యాలలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఐకేపీ కేంద్రం, రూ.36 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించడంతో పాటు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపెండ్యాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గత పాలకులు అభివృద్ధిని పక్కనపెట్టి కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి ఆరోపణలపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. దళితబంధు పథకం అమలు, పదవుల వినియోగం వంటి అంశాలపైనా ఆయన విమర్శలు చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, చేయూత పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.