పెద్దపెండ్యాలలో రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు

హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఐకేపీ కేంద్రం, రూ.36 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించడంతో పాటు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపెండ్యాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. గత పాలకులు అభివృద్ధిని పక్కనపెట్టి కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చారని...