Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారత్ సమ్మిట్‌లో వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు.. జియాకోమో ఫిలిబెక్‌పై చర్యలు తీసుకోవాలి

Author
Posted By Nagaraju Golla
| 17 Nov 2026, 03:21 PM |
భారత్ సమ్మిట్‌లో వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు.. జియాకోమో ఫిలిబెక్‌పై చర్యలు తీసుకోవాలి

జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై విదేశీ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా ఎస్పీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిషీధర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దేశ గౌరవానికి భంగం కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యంపై విదేశీ ప్రతినిధి వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, భారత్ సమ్మిట్ నిర్వాహకుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. భారత సార్వభౌమాధికారం, రాజ్యాంగ గౌరవం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎరుకల గణపతి, రాష్ట్ర నాయకులు బట్టు రవి, దుప్పటి భద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, తాడికొండ రవికిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, వట్టెం తిరుపతి, మునీందర్, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్, రూరల్ అధ్యక్షుడు పులగుజ్జు రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి