Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను!

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 08:17 AM |
ఎల్‌నినో ప్రభావం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను!

హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడమే మంచిదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, రానున్న రోజుల్లో తాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని, నీళ్లు, కరెంటు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జనవరి తర్వాత తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం సరైన అంచనా వేయలేకపోతోందని, ముందస్తు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. జూన్ తర్వాత కూడా ఎల్‌నినో ప్రభావం కొనసాగితే అధికార పార్టీకి ఎన్నికల్లో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

కరువు పరిస్థితుల తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు తిరిగి గెలిచిన చరిత్ర లేదని తుమ్మల గుర్తుచేశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు సైతం కరువు అనంతరం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీ అమలుపై గ్రామాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని మంత్రి తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇచ్చిందో ప్రస్తుతం కూడా అంతే ఇస్తున్నారని, పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నల్లోనూ న్యాయం ఉందని అంగీకరించారు.

రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం జరిగితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మంత్రి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తుమ్మల చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి