ఎల్నినో ప్రభావం ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను!
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడమే మంచిదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, రానున్న రోజుల్లో తాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఎల్నినో ప్రభావం కనిపిస్తోందని, నీళ్లు, కరెంటు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జనవరి తర్వాత తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వం సరైన అంచనా వేయలేకపోతోందని, ముందస్తు చర్యలు...