Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జవహర్‌నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 08:14 AM |
జవహర్‌నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

జవహర్‌నగర్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని గబ్బిలాల పేటలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. మాజీ మేయర్, జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ పనులు చేపట్టారు. స్థానిక ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు ఆమె కృషి చేశారు. ఈ స్తంభాల ఏర్పాటు ద్వారా ప్రాంతంలో విద్యుత్ సరఫరా సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గనున్నాయి.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ తీసుకున్న శాంతి కోటేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, కాలనీల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ జవహర్‌నగర్ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు శాంతి కోటేష్ గౌడ్ పేర్కొన్నారు.