జవహర్‌నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

జవహర్‌నగర్, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని గబ్బిలాల పేటలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. మాజీ మేయర్, జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ పనులు చేపట్టారు. స్థానిక ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు ఆమె కృషి చేశారు. ఈ స్తంభాల ఏర్పాటు ద్వారా ప్రాంతంలో విద్యుత్ సరఫరా సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గనున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ తీసుకున్న...