Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 08:11 AM |
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): బాలల హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలల నుంచి మొత్తం 22 వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల నుంచి 22 దరఖాస్తులు అందాయని తెలిపారు. బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్య, వైద్యం, పోషకాహారం, బాలల రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను బాలలు ప్రత్యేక డెస్క్ ద్వారా నేరుగా అధికారులకు తెలియజేశారు. బాలల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజు, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ నరసింహారావు, బాలల సంరక్షణ అధికారి రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి