బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): బాలల హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలల నుంచి మొత్తం 22 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల నుంచి 22 దరఖాస్తులు అందాయని తెలిపారు. బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా అధికారుల...