Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 08:07 AM |
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 152 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిల్లో స్వీకరించే ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. పోర్టల్‌లో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, కొత్తగా వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అధికారి తమ లాగిన్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను స్థానికంగానే పరిష్కరిస్తే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలు, రెవెన్యూ శాఖకు సంబంధించి 52 దరఖాస్తులు, డీడబ్ల్యూఓకు 32, డీఆర్డీఓకు 16, డీపీఓకు 7, మున్సిపాలిటీకి 7 దరఖాస్తులు అందాయి. మిగిలిన 38 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి. మొత్తం 152 దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారం కోసం శాఖల వారీగా సంబంధిత అధికారులకు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఐఈఓ సులోచన రాణి, డీవైఎస్ఓ వెంకటరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి