ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 152 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిల్లో స్వీకరించే ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. పోర్టల్లో పరిష్కారం కాకుండా పెండింగ్లో...