Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణికి విశేష స్పందన

Author
Posted By Marelli kiran
| 17 Nov 2026, 07:57 AM |
హనుమకొండ కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణికి విశేష స్పందన

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 51 అర్జీలు అందగా, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీటి కొరత, ఆధార్ కార్డుల అప్‌డేట్, పాఠశాల భవనాల మరమ్మతులు, వేడినీటి సౌకర్యం, భోజన మెనూ సక్రమంగా అమలు కాకపోవడం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సమస్యలపై విద్యార్థులు కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ప్రాధాన్యతతో పరిగణించాలని సూచించారు. చిన్నారులు సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు విద్యార్థులకు పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ విశ్వజతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.