హనుమకొండ కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణికి విశేష స్పందన

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 51 అర్జీలు అందగా, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో తాగునీటి కొరత, ఆధార్ కార్డుల అప్‌డేట్, పాఠశాల భవనాల మరమ్మతులు, వేడినీటి సౌకర్యం, భోజన మెనూ సక్రమంగా అమలు కాకపోవడం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సమస్యలపై విద్యార్థులు కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు...