Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వరంగల్ తూర్పులో చేయూత పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు

Author
Posted By Marelli kiran
| 17 Nov 2026, 07:53 AM |
వరంగల్ తూర్పులో చేయూత పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం ఎల్బీనగర్‌లోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించనున్న వేదికను సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సభా ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేయనున్నట్లు కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.

ఇవి కూడా చదవండి