వరంగల్ తూర్పులో చేయూత పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు
హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం ఎల్బీనగర్లోని ఏ1 కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించనున్న వేదికను సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పింఛన్ లబ్ధిదారులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి...