Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 07:45 AM |
మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, ఆత్మగౌరవంతో స్వతంత్ర జీవనం సాగించాలనే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని 41వ వార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్య యూత్ క్లబ్ సౌజన్యంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి – సూర్యాపేట ఆధ్వర్యంలో, మున్సిపల్ వైస్ చైర్మన్, 41వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. షఫీ ఉల్లా సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ఎంతో కీలకమని అన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలంటే ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని, భవిష్యత్తులో సొంతంగా కుట్టు మిషన్లతో ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరికొందరికి ఉపాధి మార్గం చూపుతూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రమణ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి