మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం
సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, ఆత్మగౌరవంతో స్వతంత్ర జీవనం సాగించాలనే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని 41వ వార్డులో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్య యూత్ క్లబ్ సౌజన్యంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి – సూర్యాపేట ఆధ్వర్యంలో, మున్సిపల్ వైస్ చైర్మన్, 41వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. షఫీ ఉల్లా సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట...