Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి వినతుల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Nov 2026, 02:17 PM |
ప్రజావాణి వినతుల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు

ప్రతి దరఖాస్తును నమోదు చేసి.. పరిష్కారంపై వారంవారీ నివేదిక ఇవ్వాలి

భీమదేవరపల్లి, నవంబర్ 16 (ప్రజా నేస్తం జ్వాల): ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును నమోదు చేసి, పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజల సమస్యలను ఓపికగా విని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

అనంతరం మండలంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలు, యాసంగి ఆరుతడి పంటల సాగు, విద్యుత్ సమస్యలు, విద్యా, వైద్య రంగాలపై అధికారులతో సమీక్షించారు. గతంలో గుర్తించిన సమస్యలు, పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలతో వారంవారీ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రజావాణి సమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి