ప్రజావాణి వినతుల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
ప్రతి దరఖాస్తును నమోదు చేసి.. పరిష్కారంపై వారంవారీ నివేదిక ఇవ్వాలి భీమదేవరపల్లి, నవంబర్ 16 (ప్రజా నేస్తం జ్వాల): ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును నమోదు చేసి, పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజల సమస్యలను ఓపికగా విని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం మండలంలో ఆయిల్‌పామ్ సాగు...