Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేయూ ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్ ఫీజు వివాదం

Author
Posted By Marelli kiran
| 15 Nov 2026, 10:43 PM |
కేయూ ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్ ఫీజు వివాదం

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాలు, ఆడిటర్ ఫీజు చెల్లింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. 2015-16 నుంచి 2020-21 వరకు ఆరేళ్ల కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ యూనివర్సిటీకి రూ.375.82 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ తరఫున చేపట్టిన న్యాయపోరాటం అనంతరం 2026 మార్చిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ పన్ను డిమాండ్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే, ఈ కేసులో యూనివర్సిటీ తరఫున సేవలందించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆడిటర్‌కు చెల్లించాల్సిన రూ.75 లక్షల ఫీజు ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆడిటర్ ఫీజు చెల్లింపులకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ పరిణామాలతో యూనివర్సిటీ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ఫీజు చెల్లింపుల విధానం, ఉన్నతాధికారుల జవాబుదారీతనంపై విద్యార్థులు, విద్యావేత్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పన్ను డిమాండ్ రద్దు అయినప్పటికీ ఆడిటర్ ఫీజు చెల్లింపుల వివాదం కొనసాగుతుండటంతో ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.