కేయూ ఆర్థిక వ్యవహారాల్లో ఆడిటర్ ఫీజు వివాదం
హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవహారాలు, ఆడిటర్ ఫీజు చెల్లింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. 2015-16 నుంచి 2020-21 వరకు ఆరేళ్ల కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ యూనివర్సిటీకి రూ.375.82 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ తరఫున చేపట్టిన న్యాయపోరాటం అనంతరం 2026 మార్చిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ పన్ను డిమాండ్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, ఈ కేసులో యూనివర్సిటీ తరఫున సేవలందించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆడిటర్‌కు చెల్లించాల్సిన రూ.75 లక్షల ఫీజు ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆడిటర్ ఫీజు చెల్లింపులకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ...